టాలీవుడ్ లో ఉన్నప్పుడు స్టార్ హీరోగా నటించిన వారిలో కమల్ హాసన్ కూడా ఒకరు. ప్రస్తుతం ఆయన సీనియర్ హీరో అయినప్పటికీ యంగ్ హీరోలకు సైతం ఇండస్ట్రీలో పోటీ ఇస్తున్నారు. నిజానికి కమల్ హాసన్ తమిళ హీరో అయినప్పటికీ.. తెలుగులోను ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భారతీయుడు సినిమాలో కమలహాసన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే మిస్ కాకుండా చూస్తుంటారు. ఈ చిత్రంలో కమల్ నటనతో అదరగొట్టారు. అదేవిధంగా దశావతారంలో కమల్ హాసన్ 10 పాత్రలలో నటించి నటరాజు అనిపించుకున్నారు. 

ఇలా కమల్ కేరీలో ఎన్నో గొప్ప సినిమాలు ఉన్నాయి. నటుడు కమలహాసన్ వరుస సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్నారు. తర్వాత కమల్ హాసన్ జోష్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక సినిమాల్లో కమల్ హాసన్ ఎంతో సక్సెస్ అయినా పర్సనల్ లైఫ్ లో మాత్రం విమర్శలు తప్పలేదు. కమల్ హాసన్ మొదట 1988లో అప్పటి హీరోయిన్ సారికను వివాహం చేసుకున్నారు. వీరికి శృతిహాసన్, అక్షరాహాసన్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కూడా హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. శృతి హీరోయిన్ గా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.

కానీ కమల్ హాసన్ సారికకు 2004లోనే విడాకులు ఇచ్చారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారు. మరోవైపు సారిక కంటే ముందే వాణి గంగపతి అనే మహిళను కమల్ వివాహం చేసుకున్నారు. ఆమెకు సైతం ఆయన విడాకులు ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో కమల్ హాసన్ ప్రేమించే పెళ్లి చేసుకోవాలని అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే జీవితం అవతలి వారి చేతుల్లో అరేంజ్డ్ గా ఉంటుందని అన్నారు. ప్రేమించి నచ్చిన వారిని పెళ్లి చేసుకోవాలని సూచించారు. దీంతో నెటిజన్ ఆయన మీద ఫైర్ అవుతున్నారు. రెండు ఫెయిల్యూర్ లవ్ మ్యారేజ్ కు చేసుకున్న కమల్ హాసన్ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవద్దని సలహాలు ఇస్తున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: