సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం అనేక మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే అద్భుతమైన గుర్తింపు తక్కువ సినిమాల ద్వారా వస్తూ ఉంటుంది . అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తక్కువ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీ మణులు చాలా మంది ఉన్నారు. అలా తక్కువ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో అశీకా రంగనాథ్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందిన అమిగొస్ అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన నా సామి రంగ అనే సినిమాలో నాగార్జునకు జోడిగా నటించింది. పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో ఆషిక రంగనాథ్ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ బ్యూటీ కి ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు లభించింది.

ఇకపోతే ప్రస్తుతం ఈ నటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంబర సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి , అందులో ఆశిక రంగనాథ్ పాత్రకు కూడా మంచి గుర్తింపు వచ్చినట్లయితే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: