టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా పేరు పొందిన సాయి పల్లవి తన నటనతోనే అందంతో నాచురల్ బ్యూటీగా ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ అని సంపాదించుకుంది. చివరిగా ఈమె నాగచైతన్య నటించిన తండేల్ చిత్రంలో నటించింది. డైరెక్టర్ చందు మెండేటి డైరెక్షన్లు వచ్చిన ఇచ్చిన ఫిబ్రవరి 7న థియేటర్లో విడుదల బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. తాజాగా ఈమె బాలీవుడ్లో రామాయణ చిత్రంలో నటిస్తోంది. ఇందులో సీత పాత్రలో కనిపిస్తూ ఉండగా రణబిర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా కనిపించబోతున్నారు డైరెక్టర్ నితీష్ తివారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


అయితే ఈ రామాయణ కథను రెండు భాగాలుగా తీయబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి 19 మొదటి భాగాన్ని రిలీజ్ చేయబోతున్నారు.. ఇదంతా ఇలా ఉన్నప్పటికీ తాజాగా ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన పాత్రల గురించి పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తాను తన పాత్రను ఎంపిక చేసుకునేటప్పుడే కథలో లోతెంత ఉందని విషయాన్ని చూస్తానని తన పాత్రకు బలమైన బాగోద్వేగం ఉందా లేదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటానని తెలిపింది.


అలాగే ప్రేక్షకులకు నిజాయితీ గల కథలను చెప్పాలని తపన పడుతూ ఉంటానని అందుకే తన పాత్ర తాలూకా బాగోద్వేగాలకి ఎక్కువగా ప్రేక్షకులు కనెక్ట్ అవుతూ ఉంటారని అది తనకు గొప్ప విజయంగా భావిస్తానని తెలిపింది సాయి పల్లవి. అందుకే అవార్డుల కన్నా తాను ప్రేక్షకుల మనసు గెలుచుకోవడమే తనకి మొదటి ప్రాధాన్యత ఇస్తానని తెలిపింది. మొదటిసారి రామాయణ కథతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడం తనకి చాలా ఆనందంగా ఉందని అందులో కూడా సీత పాత్ర వంటి వాటిలో నటించడం కూడా చాలా గౌరవంగా ఉందని తెలియజేసింది సాయి పల్లవి. సాయి పల్లవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి తెలుగులో ఏ సినిమాతో వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: