
సమ్మర్ సీజన్‌పై ఇండస్ట్రీకి ఎంతో కొంత నమ్మకం ఎక్కువే. అందుకే వరుసగా సినిమాలు ప్లాపులు అవుతున్నా కూడా ఈ వేసవికి గుర్తుండి పోయే విజయం అయితే ఇప్పటి వరకు టాలీవుడ్‌కు దక్కలేదు. కొత్త సినిమాలు వరుస పెట్టి రిలీజ్ చేస్తున్నారు. సినిమాలకు వచ్చే మూడ్‌లో జనాలు లేరు. ఐపీఎల్ ఎఫెక్ట్ ఇప్పటికే గట్టిగా ఉంది. అయినా సరే మంచి సినిమా వస్తే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారు ? అన్న ఆశతో సినిమా వాళ్లు రిలీజ్‌లు ఆపడం లేదు. గత వారం రెండు పెద్ద సినిమాలు వచ్చినా వాటికి వసూళ్లు లేవు. ఇక ఇప్పుడు మే 1న హిట్ 2 వస్తోంది. సినిమాలపై ఐపీఎల్ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అన్నది ఈ సినిమాతో తేలిపోనుంది.
హిట్ లాంటి సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీ. హిట్ 1, హిట్ 2 మంచి ఆదరణ సాధించాయి. ఇక హిట్ 3పై విపరీతమైన హైప్ ఉంది. ఈ సినిమాతో నాని తనలోని మెంటర్ మాస్‌ను బయటకు తీశాడని అర్థమవుతోంది. నాని సినిమా అంటేనే ఓ సెక్షన్ ఆడియెన్స్ ఆసక్తితో వెయిటింగ్‌లో ఉంటారు. పైగా హిట్ లాంటి ఫ్రాంచైజీలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది. పైగా నాని ప్రమోషన్ బాగా చేసుకుంటూ తన సినిమాలను జనాల్లోకి తీసుకు వెళుతున్నాడు. ఇప్పటికే హిట్ 3 ప్రమోషన్లు హోరెత్తిపోతున్నాయి.
నార్త్‌లో ప్రమోషన్లకు ఏకంగా 10 రోజులకు పైగా టైం తీసుకున్నాడు. హిట్ 3 సినిమాకు కూడా ఓపెనింగ్స్ రాకపోతే, హిట్ టాక్ వచ్చినా కలక్షన్లు అంతంత మాత్రంగా ఉంటే అప్పుడు ఐపీఎల్ ఎఫెక్ట్ మనకు బాగా ఉందన్నది తెలిసిపోతుంది. ఓ రకంగా హిట్ 3 అనేది నాని కి మాత్రమే కాదు.. ఓవరాల్ టాలీవుడ్ కే పెద్ద పరీక్ష అని చెప్పాలి.