- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. క‌ల్కి, స‌లార్ బ్లాక్ బ‌స్ట‌ర్ పాన్ ఇండియా హిట్లు. ఇప్పుడు లైన‌ప్ చూస్తే రాజాసాబ్‌, క‌ల్కి 2, స‌లార్ 2, స్పిరిట్ సినిమాలు రేసులో ఉన్నాయి. ఈ లైన‌ప్ చూస్తుంటేనే ఎంత భ‌యంక‌రంగా ఉందో తెలుస్తోంది. ప్ర‌భాస్ త‌న కెరీర్‌లో చాలా మంది హీరోయిన్ల‌తో ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల‌లో న‌టించాడు. కొంద‌రు హీరోయిన్ల‌ను రిపీట్ కూడా చేశాడు. అయితే ప్ర‌భాస్ - ర‌కుల్ ప్రీత్ సింగ్ కాంబినేష‌న్లో ఓ సినిమా తెర‌కెక్కాల్సి ఉంది. అది మిస్ అయ్యింది. అదే సినిమాను ప్ర‌భాస్ మ‌రో హీరోయిన్‌తో చేసి సూప‌ర్ హిట్ కొట్టాడు.


ప్ర‌భాస్ , కాజ‌ల్‌, తాప్సీ కాంబినేష‌న్లో వ‌చ్చిన సినిమా మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ సినిమా సూప‌ర్ హిట్‌. దిల్ రాజు నిర్మాత‌గా.. ద‌శ‌ర‌థ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా వ‌చ్చింది. ఈ సినిమాకు ముందు ర‌కుల్‌ప్రీత్‌ను హీరోయిన్‌గా తీసుకుని.. కొన్ని సీన్లు షూట్ చేశాక ప్ర‌భాస్ - ర‌కుల్ ఫెయిర్ బాగోలేద‌ని డిసైడ్ అయ్యారు. ఆమెను త‌ప్పించి ఆ ప్లేసులో కాజ‌ల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కాజ‌ల్ అప్పుడే దిల్ రాజు బ్యాన‌ర్లో ఎన్టీఆర్‌తో బృందావ‌నం సినిమా చేస్తోంది. వెంట‌నే ఆమె ప్ర‌భాస్ సినిమాకు కంటిన్యూ చేశారు. క‌ట్ చేస్తే సినిమా సూప‌ర్ హిట్‌. అలా ప్ర‌భాస్‌తో ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా చేయాల్సిన ర‌కుల్ కోల్పోయింది. త‌ర్వాత ప్ర‌భాస్ - ర‌కుల్ కాంబోలో సినిమా రాలేదు.


స‌మ‌స్య మీది.. ప‌రిష్కారం మాది.. జాగృతం కండి తెలుగు ప్ర‌జ‌లారా...

స‌మ‌స్యలు లేని వ్య‌క్తులే కాదు.. స‌మాజం కూడా లేదు. అయితే.. స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు.. దానిని ఎవ‌రికి చెప్పాలి ? ఎవ‌రిని క‌ల‌వాలి ? ఎలా ప‌రిష్క‌రించుకోవాలి ? అనేది కీల‌కం. అది అవినీతి అయినా.. లంచాలైనా.. రాజ‌కీయ నాయ‌కులు పెట్టే ఇబ్బందులు అయినా మీ స‌మ‌స్య‌ను మా స‌మ‌స్య‌గా భుజాన వేసుకుంటాం. నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అధికారులు దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చింతించాల్సిన అవ‌సర‌మే లేదు. రండి.. చేయి చేయి క‌లుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ స‌మ‌స్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.. ప‌రిష్కార మార్గాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: