
ప్రభాస్ కాల్ షీట్స్ ఎంత బిజీ బిజీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు 5 ఏళ్లు ఇక ప్రభాస్ కాల్ షీట్స్ ఖాళీగా లేవు . అయితే ప్రభాస్ సినిమాల పరంగా ఎలా ముందుకు వెళ్తున్న వ్యక్తిగతంగా ఆయన పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనేది కోట్లాదిమంది రెబల్ ఫ్యాన్స్ అభిప్రాయం. కానీ ప్రభాస్ మాత్రం ఎందుకో పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపడం లేదు . అయితే ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా సరే ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి మీడియా ఎప్పుడు ఈగర్ గా వెయిట్ చేస్తుంటుంది , చాలా బిగ్ ఛానల్స్ కూడా ప్రభాస్ ఇంటర్వ్యూ కోసం ఆయన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
రీసెంట్గా ఓ నేషనల్ మీడియా కూడా ప్రభాస్ ఇంటర్వ్యూ కోసం ఆయన ఇంటికి వెళ్లిందట . కానీ ప్రభాస్ మాత్రం తిరస్కరించారట. మరీ ముఖ్యంగా ప్రభాస్ సినిమాల పరంగా ఎదుర్కొనే క్వశ్చన్స్ కన్నా పెళ్లి గురించి ఎదుర్కొనే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి అని .. ఆ కారణంగానే పెళ్లి గురించి లేనిపోని టాపిక్ హైలెట్ చేయకూడదు అంటూ అసలు ఇంటర్వ్యూ ఇవ్వకుండానే వదిలేశారట . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ తెలివైన వాడే.. ముందుచూపుతో ఆ ఇంటర్వ్యూని రిజెక్ట్ చేశాడు అంటూ మాట్లాడుకుంటున్నారు అభిమానులు..!