
అర్తీ అగర్వాల్ 20 ఏళ్ల క్రితం తెలుగు సినిమాను తన అంద చందాలతో ఓ ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్. వెంకటేష్ హీరోగా 2001లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో హీరోయిన్ అయ్యి తక్కువ టైంలో అందరు స్టార్ హీరోలతో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసి దూసుకుపోయింది. 2001 నుంచి 2005 వరకు టాలీవుడ్‌లో ఆర్తీ అగర్వాల్ ఒక ఊపు ఊపేసింది. సీనియర్ హీరోల నుంచి జూనియర్ హీరోల వరకు అందరితోనూ ఆమె సినిమాలు చేసింది. నాలుగు ఏళ్ల పాటు ఏ సూపర్ హిట్ సినిమా చూసినా ఆమే హీరోయిన్.
ఆ తర్వాత ఆర్తీ అప్పట్లో యంగ్ హీరో తరుణ్ తో ప్రేమలో పడి ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లకపోవడంతో బాగా నిరాశలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత బరువు తగ్గేందుకు చేయించుకుని ఆపరేషన్ వికటించి చిన్న వయస్సులోనే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆర్తీ తరుణ్తో బ్రేకప్ తర్వాత ఓ ఎన్నారైను పెళ్లి చేసుకున్నా అది కూడా పెటాకులు అయ్యింది. ఆమె ఫేడవుట్ అయ్యాక కొరియోగ్రాపర్ కం దర్శకుడు అమ్మ రాజశేఖర్ ఆమెతో ఓ సినిమా చేశారు.
ఆ సినిమా షూటింగ్ టైంలో ఆర్తీ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయిందట. తాను కెరీర్ పరంగా బాగున్నప్పుడు అందరూ తనను వాడుకున్నారని.. ఇప్పుడు దూరం పెట్టేస్తున్నారని వాపోయిందట. అప్పుడు అమ్మ రాజశేఖర్ చాలా సపోర్ట్ చేసి నీకు మంచి లైఫ్ ఉంటుందని ధైర్యం చెప్పారట. కానీ దురదృష్ట వశాత్తు ఆర్తీ చిన్న వయస్సులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.
సమస్య మీది.. పరిష్కారం మాది.. జాగృతం కండి తెలుగు ప్రజలారా...
సమస్యలు లేని వ్యక్తులే కాదు.. సమాజం కూడా లేదు. అయితే.. సమస్య వచ్చినప్పుడు.. దానిని ఎవరికి చెప్పాలి ? ఎవరిని కలవాలి ? ఎలా పరిష్కరించుకోవాలి ? అనేది కీలకం. అది అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.