గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” సినిమా ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది.. చరణ్ ని ఫుల్ మాస్ పాత్రలో చూడాలనుకుంటున్న ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ ఏ మాత్రం రుచించలేదు.. దీనితో రాంచరణ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే మాస్ సినిమా ఇవ్వాలని చూస్తున్నాడు..ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని చరణ్ బరిలోకి దిగుతున్నాడు. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్ర లో అదరగొట్టిన రామ్ చరణ్ పెద్ది సినిమాలో కూడా అలాంటి ఒక యాసతోనే ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయబోతున్నారు.

క్రికెట్ ప్రధానంగా సాగే ఈ సినిమా లో చాలా ఎమోషన్స్ ఎలివేషన్స్ ఉండడమే కాకుండా హీరో క్యారెక్టరైజేషన్స్ మీద కూడా ఈ సినిమా డిపెండ్ అయి ఉంటుందని సమాచారం.ఇక ఈ సినిమా వల్ల రామ్ చరణ్ భారీ క్రేజ్ ను సంపాదించుకోబోతున్నాడనే న్యూస్ వైరల్ అవుతుంది... ఇక బుచ్చి బాబు ఈ సినిమాని టాప్ లెవల్లో నిలపడమే కాకుండా ఈ సినిమా తో సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారట..పెద్ది సినిమా కనుక భారీ సక్సెస్ సాధిస్తే బుచ్చి బాబు స్టార్ డైరెక్టర్ గా మారతాడు.

బుచ్చి బాబు ఈ సినిమాను ఎంతో ఛాలెంజింగ్ తీసుకున్నట్లు సమాచారం.ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయని.. ఫ్యాన్స్ చరణ్ పెర్ఫార్మన్స్ కి స్టన్ అయిపోతారని సమాచారం.చరణ్ ఈ సినిమా లో మాస్ యాంగిల్ చూపిస్తూనే కామెడీని కూడా చాలా జన్యున్ గా పండించే ప్రయత్న అయితే చేస్తున్నారని తెలుస్తుంది.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: