
మెగాస్టార్ చిరంజీవి - యూవీ క్రియేషన్స్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ అయినప్పటి నుంచి సిజి పనుల మీద జరుగుతున్న చర్చలు అంతా కాదు. అయితే క్వాలిటీ విషయంలో ఎవరికీ నమ్మకాలు లేవు. వాస్తవానికి సంక్రాంతి రావలసిన సినిమా పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తోంది. అసలు ఈ సినిమా విషయంలో చిరంజీవి అభిమానులకు .. అటు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు ... కనీసం సగటు సినీ అభిమానులకు కూడా పెద్దగా నమ్మకాలు లేవు. విశ్వంభర సినిమా గ్రాఫిక్స్ కోసం ఏకంగా 70 నుంచి 75 కోట్లు ఖర్చు చేస్తున్నారని .. పెద్ద పెద్ద సంస్థలకు ఈ పనులు అప్పగించారని ఒక ప్రచారం జరిగింది. అయితే ఇన్‌సైడ్ వర్గాలలో మరో ప్రచారం జరుగుతుంది. అసలు విశ్వంభర సినిమా గ్రాఫిక్స్ కు 25 కోట్లు మాత్రమే ఖర్చు పెడుతున్నారని ... అంతకుమించి పైసా బడ్జెట్ పెట్టడానికి కుదరదు అని నిర్మాతలు చెప్పారని తెలుస్తోంది.
వాస్తవానికి సినిమా అవుట్ పుట్ విషయంలో చాలామందికి సందేహాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ ఏకంగా రు. 250 కోట్లు అంటున్నారు. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ఓటీటీ లెక్కలు వేరు.. ఇప్పుడు ఉన్న ఓటీటీ లెక్కలు వేరు. ఇప్పుడు రు. 250 కోట్ల బడ్జెట్ అంటే వర్కవుట్ అవుతుందా ? అన్న సందేహాలు ఉన్నాయి. ప్రి రిలీజ్ బిజినెస్ ఎంక్వైరీలు బడ్జెట్ రేంజ్‌లో లేవని ... ఏరియాల వారీగా ఎక్కువ అమౌంట్లు కోట్ చేయడం లేదంటున్నారు. అందుకే విశ్వంభర సినిమాకు రావాల్సిన రేంజ్ హైప్ అయితే రావడం లేదు.
సమస్య మీది.. పరిష్కారం మాది.. జాగృతం కండి తెలుగు ప్రజలారా...
సమస్యలు లేని వ్యక్తులే కాదు.. సమాజం కూడా లేదు. అయితే.. సమస్య వచ్చినప్పుడు.. దానిని ఎవరికి చెప్పాలి ? ఎవరిని కలవాలి ? ఎలా పరిష్కరించుకోవాలి ? అనేది కీలకం. అది అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.