టాలీవుడ్ నటుడు నితిన్ 2002 వ సంవత్సరం విడుదల అయిన జయం మూవీతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సదా హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో మొదటి మూవీ తోనే నటుడిగా నితిన్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా ఈయన కెరియర్ను మంచి స్థాయిలో ముందుకు సాగించాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం నీతిన్ కి వరుస పెట్టి భారీ ఫ్లాప్స్ దక్కుతూనే ఉన్నాయి. ఆఖరుగా నితిన్ కి వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన భీష్మ అనే మూవీ తో మంచి విజయం దక్కింది.

ఆ తర్వాత ఈయన చెక్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ తర్వాత ఈయన నటించిన రంగ్ దే మూవీ కూడా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ తర్వాత ఈయన నటించిన మాస్టర్ సినిమా థియేటర్లలో కాకుండా ఓ టీ టీ లో విడుదల అయింది. ఆ తర్వాత ఈయన నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అలాగే కొంత కాలం క్రితం ఈయన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాతో ప్రేక్షకులను ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా భారీ ఫ్లాప్ ను అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు రాబిన్ హుడ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.

సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇలా నితిన్ ఆఖరుగా ఐదు సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం ఈయన తమ్ముడు సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటాడు నితిన్ అభిమానులు భావిస్తున్నారు. తమ్ముడు సినిమాతో నితిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: