
అయితే అనుష్క మాత్రం అలా కాదు నాటీసిన్స్ లో నటిస్తుంది. రొమాంటిక్ సీన్స్ లో నటిస్తుంది . వల్గర్ సీన్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి . కానీ ఎక్కడా కూడా తన పర్సనల్ కెరియర్ పై ఆ ఇంపాక్ట్ పడనివ్వలేదు అనుష్క . ఇప్పటికి ఎప్పటికీ టాలీవుడ్ జేజమ్మ గానే చూస్తున్నారు జనాలు. అంతలా ఆమె పేరుపై ఓ మంచి అభిప్రాయం అభిమానులకి ఉంది. కాగా "ఘాటి" సినిమా తర్వాత తెలుగులో కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదు అనుష్క . మలయాళం లో ఓ సినిమా చేస్తుంది అంటూ టాక్ వినపడింది .
అయితే ఇప్పుడు తెలుగు సినిమాకి సైన్ చేసినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది . అనుష్క శెట్టి మరో ఫిమేల్ లేడీ ఓరియంటెడ్ సినిమాకు సైన్ చేసిందట . ఈ సినిమాని తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు టాక్ బయటపడ్డింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుందట . హైలైట్ ఏంటంటే ఇది ఓ హీరోయిన్ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన మూవీ అంటూ తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో అనుష్క శెట్టి పేరు మరొకసారి మారుమ్రోగిపోతుంది..!