టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించగా ... బీన్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ ద్వారా వెంకటేష్ కు చాలా రోజుల తర్వాత సూపర్ సాలిడ్ విజయం దక్కింది. ఇకపోతే ఈ మూవీ విడుదల అయ్యి తాజాగా 100 రోజులను కంప్లీట్ చేసుకుంది. దానితో ఈ మూవీ బృందం ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రకారం ఈ సినిమా 100 రోజులను కంప్లీట్ చేసుకున్నట్లు , అలాగే 350 కోట్ల గ్రాస్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు , అలాగే 2025 వ సంవత్సరం ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా క్రేజీ సినిమాలే విడుదల అయ్యాయి. కానీ అన్ని సినిమాల దాటిని తట్టుకొని సంక్రాంతికి వస్తున్నాం సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి ఈ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: