ఇప్పుడు నందమూరి అభిమానులకి 1000 గిటార్లు మోగితే ఎలా ఉంటుందో అలాంటి ఒక ఫీలింగ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు . సాధారణంగా నందమూరి బాలయ్య సినిమా తెరకెక్కుతుంది అంటే కచ్చితంగా అభిమానులకి ఒక స్పెషల్ ఫీలింగ్ కలుగుతుంది . బాలయ్య అందరిలా హీరోయిన్స్ విషయంలో రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టడు. అది అందరికీ తెలిసిందే.  బాలయ్య పక్కన కొందరు మాత్రమే సెట్ అవుతారు.. సూట్ అవుతారు . అందుకే మేకర్స్ ఆచితూచి బాలయ్య సినిమాలో హీరోయిన్ ని చూస్ చేసుకుంటూ ఉంటారు.


అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ బాలయ్య సినిమాలో విలన్ గా నటించబోతుంది అంటూ న్యూస్ బయటకు వచ్చింది . అది కూడా బాలయ్య ఫేవరెట్ బ్యూటీ . ఒకప్పుడు ఆయనతో కలిసి చిందులు వేసి సూపర్ డూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న బ్యూటీ.  ఆమె మరెవరో కాదు "విజయశాంతి".  రీసెంట్గా నే అర్జున సన్ ఆఫ్ వైజయంతి మూవీతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న విజయశాంతి .. అఖండ 2 సినిమాలో విలన్ షేడ్స్ లో కనిపించబోతుందట . అంటే పూర్తిగా కాకపోయినా ఆమెను నెగిటివ్ క్యారెక్టర్ లో చూపించడానికి బోయపాటి శ్రీను ఇంట్రెస్టింగ్ గా క్యారెక్టర్ ని రాసుకున్నారట .



నిజానికి ఈ రోల్ లో ముందుగా రమ్యకృష్ణ ని అనుకున్నారట.  కానీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ కి విజయశాంతి బాగుంటుంది అంటూ ఆమెను ఈ రోల్ లో నటింప చేయాలి అని స్టోరీ కూడా వివరించారట . అయితే విజయశాంతి నెగిటివ్ షేడ్స్ అన్న ఒక్క కారణంగా వెనకడుగు వేస్తుందట . కానీ క్యారెక్టర్ మాత్రం అద్దిరిపోతుంది అని బాలయ్య - విజయశాంతి కాంబో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ట్రెండ్ సెట్టర్ గా ఉండిపోతుంది అని ఈసారి ఆమె గాని ఈ రోల్ ఒప్పుకుంటే ఇక ఇండస్ట్రీలో ఆమెకు తిరుగుండదు అంటున్నారు జనాలు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: