ఏంటి రష్మిక విజయ్ దేవరకొండని వదిలేసి ఆ స్టార్ క్రికెటర్ ని పెళ్లి చేసుకుందాం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్ లో ఎంత నిజం ఉంది..ఇంతకీ రష్మిక మందన్నా పెళ్లి చేసుకున్న ఆ క్రికెటర్ ఎవరు అని చాలామందిలో ఒక ఆత్రుత అయితే ఉంటుంది.అయితే రష్మిక మందన్నా పెళ్లి చేసుకున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న క్రికెటర్ ఎవరో కాదు స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా.. గత ఏడాది భార్య నటాషా తో విడాకులు తీసుకున్న హార్దిక్ పాండ్యా ప్రస్తుతం హీరోయిన్ రష్మిక మందన్నాని పెళ్లి చేసుకొని దుబాయ్ లో సీక్రెట్ గా కాపురం పెట్టారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫోటోలో ఏముందంటే రష్మిక మందన్నా, హార్దిక్ పాండ్యా ఇద్దరి మెడలో పూల దండలతో అలాగే రష్మిక మందన్నా తన నుదుటన సింధూరంతో కనిపించింది. 

దీంతో చాలామంది నెటిజెన్లు ఇదేంటి రష్మిక మందన్నా హార్థిక్ పాండ్యా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోస్ లో ఉన్నది నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు రష్మిక మందన్నా హార్థిక్ పాండ్యా ఇద్దరు దుబాయ్ లో సీక్రెట్ గా కాపురం పెట్టారంటూ కూడా కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోస్ లో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏఐ టెక్నాలజీతో చాలా మంది సెలబ్రిటీల ఫోటోలను ఇలాగే క్రియేట్ చేస్తూ వారి పరువు కి భంగం కలిగిస్తున్నారు. అలా తాజాగా రష్మిక మందన్నా హార్థిక్ పాండ్యా ఇద్దరు పెళ్లి చేసుకున్నట్టు ఒక ఫోటో క్రియేట్ చేయడంతో  ఈ ఫోటో పై నెటిజన్లు మండిపడుతున్నారు.

అంతేకాదు ఈ ఫోటో ఉత్తి ఫేక్ అని తేల్చి పారేస్తున్నారు. ఎందుకంటే రష్మిక మందన్నా హీరో విజయ్ దేవరకొండ తో డేటింగ్ లో ఉంది.అలాగే హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా తో విడాకులు తీసుకున్నాక బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియాతో లవ్ లో ఉన్నారు. కానీ సడన్గా రష్మిక హార్దిక్ పాండ్యా ఇద్దరు పెళ్లి చేసుకున్నట్టు హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ పేజ్ అనే ఫేస్బుక్ ఖాతాలో వీరిద్దరికి సంబంధించిన ఈ ఫోటో షేర్ చేయడంతో పాటు దుబాయ్ లో వీరిద్దరూ కాపురం పెట్టారు అని రాసుకొచ్చారు.దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకున్నట్టు క్రియేట్ చేసిన ఏఐ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: