కొంతమంది నటీనటులు తాము నటించినకొన్ని సినిమాలలో తమ పాత్రలకు ప్రాధాన్యం లేకపోవడంతో ఆ సినిమాల వల్ల తమకి ఇండస్ట్రీలో కొంత నష్టం జరిగిందని ఆ సినిమాల్లో నటించి కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత ఆ సినిమా వేస్ట్ చేసాం కెరీర్ మొత్తం నాశనమైంది అని అనుకుంటూ ఉంటారు. అయితే అలాగే ఓ హీరోయిన్ కూడా అనుకుందట. అది కూడా బాలకృష్ణ సినిమాలో చేసి. మరి ఇంతకీ బాలకృష్ణ సినిమాలో చేసి పెద్ద తప్పు చేశా అని అన్న ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ నటించిన ఒక్క మగాడు అనే సినిమా అందరూ చూసే ఉంటారు.2008లో వచ్చిన ఈ సినిమా వైవిఎస్ చౌదరి దర్శక నిర్మాణంలో తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో  మెయిన్ హీరోయిన్ గా సిమ్రాన్ నటించింది.

 అయితే ఈ సినిమాలో ఓ పాటలో అనుష్క శెట్టి బాలకృష్ణతో స్టెప్పులు వేసింది.ముఖ్యంగా ఈ పాట మాత్రం తీవ్ర విమర్శలకు గురైంది. ఎందుకంటే ఈ పాటలో అనుష్క శెట్టి చాలా అసభ్యంగా కనిపించడంతో పాటు అంగాంగ ప్రదర్శన చేయడంతో చాలామంది అనుష్కసినిమా ఎందుకు ఒప్పుకుందా అని ఫైరయ్యారు.అయితే కెరీర్ మొదట కాబట్టి పెద్ద హీరో అని అనుష్కసినిమా ఒప్పుకుందట.కానీ ఆ తర్వాత తనపై వచ్చిన విమర్శలు చూసి ఈ సినిమాలో నటించి పెద్ద తప్పు చేశాను అంటూ అనుష్క ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొని బాధపడింది.ఇక 2008 సంక్రాంతి కానుకగా విడుదలైన ఒక్క మగాడు సినిమా భారీ డిజాస్టర్ అయింది.

సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా వల్ల అనుష్క కూడా చాలానే నష్టపోయిందట. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ బాలకృష్ణ లాంటి సీనియర్ హీరో మూవీలో ఇలాంటి రోల్ ఎంచుకోవడం అస్సలు బాలేదని చాలామంది విమర్శించారు.అలా ఈ సినిమా వల్ల తనకు వచ్చింది ఏమీ లేదు అని సినిమాలో నటించి పెద్ద తప్పు చేశాను అని అనుష్క ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొని బాధపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: