తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే దళపతి విజయ్ ఓ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే. మరి కొంత కాలం లోనే విజయ్ పూర్తిగా తన సమయాన్ని రాజకీయాలపైనే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం మాత్రం విజయ్ "జన నయగాన్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ తో సినిమాలను ఆపేసి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టనున్నట్లు విజయ్ ఒకానొక సందర్భంలో ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ నటిస్తున్న మూవీ కావడం , ఈ సినిమా తన కెరీర్లో లాస్ట్ మూవీ అని విజయ్ స్వయంగా ప్రకటించడంతో ఈ మూవీ పై విజయ్ అభిమానులతో పాటు అనేక మంది సాధారణ ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ నుండి ఇప్పటికే కొన్ని పోస్టర్లను మేకర్స్ విడుదల చేయగా అవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

ఇకపోతే ఈ మూవీ యొక్క నార్త్ ఇండియా హక్కులు అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా యొక్క నార్త్ ఇండియా హక్కులను అత్యంత భారీ ధరకు ఏఏ ఫిలిమ్స్ సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ వారు ఈ సినిమాను నార్త్ ఇండియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటి నుండే ప్రణాళికలను కూడా వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ తో విజయ్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: