టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ కొన్ని సంవత్సరాల క్రితం సరైనోడు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్ , కేథరిన్ హీరోయిన్లుగా నటించగా ... బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందించగా ... ఈ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించాడు. ఈ మూవీ 2016 వ సంవత్సరం ఏప్రిల్ 22 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో 9 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల అయ్యి తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకు ఆ సమయంలో వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 19.12 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 10.73 కోట్లు , ఉత్తరాంధ్రలో 8.05 కోట్లు , ఈస్ట్ లో 5.15 కోట్లు , వెస్ట్ లో 4.52 కోట్లు , గుంటూరులో 5.37 కోట్లు , కృష్ణా లో 4.08 కోట్లు , నెల్లూరు లో 2.32 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 59.34 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ కి కేరళలో 3.04 కోట్లు , కర్ణాటకలో 6.25 కోట్లు , ఆఫ్ ఇండియాలో 1.25 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 73.87 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 53.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 73.87 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. దానితో ఈ మూవీ 20.47 కోట్ల లాభాలను అందుకొని భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa