టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో విజయశాంతి ఒకరు. విజయశాంతి మాట్లాడుతూ ఈ మధ్య నేను చేసిన ఓ సినిమా విషయంలో ప్రేక్షకులు అంతగా సంతృప్తి చెందలేదని విజయశాంతి చెప్పుకొచ్చారు. ఆ సమయంలో యాక్షన్ ప్రధాన పాత్రలో నటిస్తే బాగుంటుందనే ఒపీనియన్ కలిగిందని విజయశాంతి పేర్కొన్నారు.
 
నేనేం చేశానో నా సినిమాల వైభవం ఏంటో నిన్నటితరం ప్రేక్షకులకు తెలుసని అలా కొత్త తరం ప్రేక్షకులకు తెలిసేలా అర్జున్ సన్నాఫ్ వైజయంతి తెరకెక్కిందని ఆమె తెలిపారు. ఈ సినిమాలో తల్లీ తనయుల బంధంతో పాటు ఎమోషన్స్, యాక్షన్ నన్ను ఆకట్టుకుందని ఆమె అన్నారు. రాములమ్మను ఎలాంటి పాత్రలో చూడాలని అనుకున్నామో అలాంటి పాత్రలో చూశామని చెబుతున్నారని ఆమె తెలిపారు.
 
కళ్యాణ్ రామ్ తో నాకు ఆప్యాయత చూస్తే గత జన్మలో కళ్యాణ్ రామ్ నా బిడ్డేనేమో అనిపిస్తుందని ఆమె వెల్లడించారు. ఈ సినిమాకు అలా అన్నీ అద్భుతంగా కుదిరాయని భవిష్యత్తులో రేపటి నుంచి ఈ సినిమాకు ఆదరణ మరింత పెరుగుతుందని ఆమె చెప్పుకొచ్చారు. నేను దాదాపుగా 60 మంది హీరోలతో కలిసి పని చేశానని ఎన్నో సినిమాలకు పని చేశానని ఆమె వెల్లడించారు.
 
అప్పట్లో బండ్లు కట్టుకుని సినిమాలను చూడటానికి వచ్చేవారని ఈతరం సైతం నన్ను రాములమ్మ అనే పిలుస్తున్నారని ఆమె పేర్కొన్నారు. సభలకు వెళ్లిన సమయంలో సైతం నన్ను రాములక్క అని పిలుస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని ఆమె పేర్కొన్నారు. విజయశాంతి చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. విజయశాంతి ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లకు విజయశాంతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కెరీర్ పరంగా విజయశాంతి మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిద్దాం. విజయశాంతిని అభిమానించే వాళ్లు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.








మరింత సమాచారం తెలుసుకోండి: