హీరోయిన్ల మధ్య గొడవలు,విభేదాలు, మనస్పర్దలు అనేవి చాలా కామన్.అలా ఓ ఇద్దరు హీరోయిన్ల మధ్య చిచ్చు చాలా దూరం వెళ్ళిందట.ఓ సీనియర్ నటి శ్రీదేవి బట్టల పై అసభ్య కామెంట్లు చేసింది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు శ్రీదేవిని టార్గెట్ చేస్తూ మాట్లాడింది అనేది ఇప్పుడు చూద్దాం.శ్రీదేవి తన అంద చందాలతో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుండి చిరంజీవి, నాగార్జున,వెంకటేష్ వంటి హీరోలతో కూడా ఆడి పాడింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ని సీనియర్ నటి సుజాత అవమానించిందట. ఇక సీనియర్ నటి సుజాత అంటే ఎవరో కాదు చంటి మూవీలో వెంకటేష్ కి తల్లి పాత్రలో నటించిన హీరోయిన్.అయితే ఈ నటి హీరోయిన్ ఛాన్సులు తగ్గాక హీరో హీరోయిన్లకు తల్లి, అత్త, బామ్మ పాత్రలు పోషించింది.

అలా ఈ హీరోయిన్సినిమా లో నటిస్తున్న సమయంలో కొత్త హీరోయిన్ శ్రీదేవి మీకు పోటీగా ఎదుగుతుంది కదా అని యాంకర్ ఓ ఇంటర్వ్యూలో సుజాతను ప్రశ్నించగా సుజాత మాట్లాడుతూ.. ఛీ ఛీ నాకు శ్రీదేవి పోటీ ఏంటి.. అసలు ఆమెతో నాకు పోలిక కలపడం నాకు ఏమాత్రం నచ్చడం లేదు.ఆమె పొట్టి పొట్టి మిడ్డీలు, స్కర్టులు,గౌనులు వేసుకొని తిరుగుతుంది. ఆమె వేసుకునే బట్టలు అంటేనే నాకు నచ్చదు.అలాగే ఎప్పటికీ ఆమె నా స్థాయికి చేరుకోలేదు. ఎప్పటికీ శ్రీదేవి నాతో సమానం కాదు.దయచేసి ఆమెతో నాకు పోలిక పెట్టకండి అంటూ శ్రీదేవి వేసుకునే బట్టల పై సంచలన కామెంట్లు చేసింది సుజాత.

 అయితే ఈ మాటలపై వెంటనే శ్రీదేవి స్పందించకపోయినప్పటికీ ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఓ సినిమాలో నటించినప్పుడు ఆ సినిమా తెరకెక్కించే దర్శకుడు చెప్పిన కథకు తగ్గట్లు బట్టలు వేసుకోవాలి. అది సుజాతకు తెలియదా.. నేను పోట్టిపొట్టి బట్టలు వేసుకుంటే హీరోయిన్ కాకుండా పోను కదా.. అయినా సుజాత కూడా మలయాళ సినిమాలో సింగిల్ టవల్ తో కనిపించింది. మరి దాని గురించి మాట్లాడడం లేదు.. సుజాత నా బట్టల గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు.ఆమె గురించి నేను ఇప్పటి వరకు ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడలేదు. కానీ నా గురించి ఎవరైనా ఆమర్యాదగా మాట్లాడితే  అస్సలు ఊరుకోను అంటూ శ్రీదేవి సుజాత మాటలపై ఫైర్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: