
ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా నోరు అదుపులో పెట్టుకోవాలని ఇలా నోరు జారి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కూడా ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. అలా డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఇప్పుడు మరొకసారి చిక్కుల్లో పడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏ ఈవెంట్ కి వెళ్ళినా కూడా ఏదో ఒక మాట అంటూ నిరంతరం వార్తలు లో నిలుస్తూ ఉంటారు హరి శంకర్. తాజాగా ఇప్పుడు జింఖానా సినిమా ఈవెంట్లో మాట్లాడినడం జరిగింది.
పక్క సినిమాలను ఎగరేసుకుంటూ వెళ్లి చూస్తాము తెలుగు సినిమాలను అసలు పట్టించుకోము అంటూ మాట్లాడారట.దీంతో ఈ వాక్యాల మీద చాలా మంది నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు. పక్క భాషల సినిమాలు రీమిక్స్ చేసే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా డైరెక్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నీకు మంచి సినిమాలు తీయడమే చేతకాదు కానీ ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడడంలో మహాముదురు అంటూ డైరెక్టర్ హరీశంకర్ ని కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్. భాష ఏదైనా సరే సినిమా మంచిగా ఉంటే ప్రేక్షకులే సక్సెస్ చేస్తారు.. తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండానే కథ నచ్చితే సినిమాలను సక్సెస్ చేసిన సందర్భాలు బాగానే ఉన్నాయని తెలుపుతున్నారు.