టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా ఇటీవల ఓదెల2 సినిమాతో హిట్ అందుకున్నారనే సంగతి తెలిసిందే. ఓదెల సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కగా దాదాపుగా రెండు దశాబ్దాలుగా విజయవంతంగా ఆమె కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఇతర భాషల్లో సైతం స్టార్ హీరోయిన్ గా ఆమె రాణిస్తుండటం కొసమెరుపు. ఈ మధ్య కాలంలో స్పెషల్ సాంగ్స్ లొ యాక్ట్ చేయడం ద్వారా తమన్నా వార్తల్లో నిలిచారు.
 
తమన్న స్పెషల్ సాంగ్స్ చేసిన సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అభిమానులు తమన్నాను ప్రేమగా మిల్కీ బ్యూటీ అని పిలుస్తారనే సంగతి తెలిసిందే. తమన్నా అందంగా కనిపించడం వల్లే అభిమానులు ఈ కామెంట్లు చేస్తారు. మిల్కీ బ్యూటీ అనే పట్టం ఫ్యాన్స్ ఇచ్చారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత మీడియా దాన్ని ఎక్కువగా వాడటం వల్ల ఆ పదం చాలామందికి దగ్గరైందని తమన్నా తెలిపారు.
 
దాని వల్ల తాను ఇబ్బందులు పడ్డానని అనుకున్నారని కానీ అందులో ఎలాంటి నిజం లేదని తమన్న కామెంట్లు చేశారు. అలా పిలిస్తే ఎవరికి ఇష్టం ఉండబో చెప్పండి అంటూ నవ్వేశారు. అదే విధంగా అందంగా ఉండటంతో మంచి ఆఫర్లు తనకు రాలేదని గుర్తు చేసుకున్నారు. తాము పని చేస్తుందని రంగుల ప్రపంచంలో అని తమన్నా కామెంట్లు చేయడం గమనార్హం.
 
అందుకోసం తాను నిరంతరం ప్రయత్నిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. తమన్నా ఓదెల2 సినిమాతో సక్సెస్ సాధించిన నేపథ్యంలో తమన్నా రాబోయే రోజుల్లో మరిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. తమన్నా కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తమన్నా రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా పారితోషికం సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: