టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ సీనియర్ హీరోయిన్లలో విజయశాంతి ఒకరనే సంగతి తెలీందే. విజయశాంతికి లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ఉంది. అయితే ఈ మధ్య కా లంలో మరి కొందరు హీరోయిన్లు విజయశాంతి ట్యాగ్ ను వాడుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ట్యాగ్ ను మొదట విజయశాంతి కోసం ఉపయోగించారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలామంది హీరోయిన్లకు ఈ ట్యాగ్ ను ఉపయొగిస్తున్నారు.
 
లేడీ సూపర్ స్టార్ ఎవరనే ప్రశ్న అభిమానుల్లో ఒకింత గందరగోళానికి తెర లేపుతోంది. విజయశాంతి మాట్లాడుతూ నాకు లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ప్రతిఘటన మూవీ తర్వాత ప్రేక్షకులు ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చారు. నేను యాక్టివ్ గా లేని సమయంలో కొంతమంది హీరోయిన్లు నా ట్యాగ్ తీసుకున్నారని ఆమె కామెంట్లు చేశారు. పాపం వాళ్లు కూడా బ్రతకాలి కదా అని నేను పెద్దగా పట్టించుకోలేదని విజయశాంతి చెప్పుకొచ్చారు.
 
చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. ఆ తర్వాత అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో నటించిన విజయశాంతి ఈ సినిమాతో మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. విజయశాంతి తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.
 
విజయశాంతి సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారో లేక రాజకీయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారో తెలియాల్సి ఉంది. విజయశాంతి పారితోషికం సైతం ఒకింత భారీ స్థాయిలోనే ఉందని సోషల్ మీడియ వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. విజయశాంతి కెరీర్ బెస్ట్ విజయాలను అందుకుంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పడంలో సందేహం అవసరం లేదు. విజయశాంతి స్క్రిప్ట్ సెలక్షన్ లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉండదు. విజయశాంతి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.






మరింత సమాచారం తెలుసుకోండి: