
ఇప్పటికే విడుదలైన ఈమూవీ టీజర్ కు మంచి స్పందన రావడంతో అభిమానులలో అంచనాలు మరింత పెరిగాయి. క్రియేటివ్ డైరెక్టర్ గా పేరుగాంచిన గౌతమ్ తిన్న నూరి ఈమూవీని తన సర్వశక్తులు పెట్టి ఈ మూవీని తీస్తున్నాడు. అయితే ఈమూవీకి సంగీత దర్శకుడుగా పని చేస్తున్న అనిరుద్ రవిచందర్ తో ‘కింగ్ డమ్’ కు సమస్యలు ఏర్పడే ఆస్కారం ఉంది అంటూ గాసిప్ లు హడావిడి చేస్తున్నాయి.
దీనికి కారణం ప్రస్తుతం అనిరుద్ చాల బిజీగా ఉండటంతో ఏసినిమాకు సరైన సమయం కేటాయించ లేకపోతున్నాడు అన్న ప్రచారం ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతోంది. ఒక సినిమా ఎంత బాగా వచ్చినప్పటికీ ఆమూవీ సంగీత దర్శకుడు రీ రికార్డింగ్ కు సరైన సమయం ఇస్తేనే ఆమూవీ అవుట్ పుట్ బాగా వస్తుంది. కమల హాసన్ ‘ఇండియన్ 2’ అజిత్ ‘పట్టుదల’ మూవీలు భయంకరమైన ఫ్లాప్ లుగా మారడంలో ఆమూవీలకు సంగీత దర్శకత్వం వహించిన అనిరుద్ సరైన అవుట్ పుట్ మ్యూజిక్ విషయంలో ఇవ్వకపోవడం వల్ల ఆసినిమాల ఫలితం బాగా రాలేదు అన్న ప్రచారం ఉంది.
అయితే అనిరుధ్ కు దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో నాని నటించిన ‘జెర్సీ’ మూవీ నుంచే మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యంతో ‘కొంగ డమ్’ మూవీ బీజీఎమ్ కోసం క్వాలిటీ టైం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని మరికొందరు అంటున్నారు. దీనితో అనిరుద్ ఎలాంటి మ్యూజిక్ ‘కింగ్ డమ్’ కు ఇస్తాడు అన్న డాని పై ఈమూవీ ఘన విజయం ఆధారపడి ఉంటుంది అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు..