
ఈ మూవీకి మంచిపేరు రావడంతో పాటు కమర్షియల్ గా కూడ సక్సస్ అవ్వడంతో ఆతరువాత ఇతడి నుండి ‘కృష్ణం వందే జగద్గురుం’ ‘కంచె’ లాంటి సినిమాలు వచ్చాయి. అయితే ఈసినిమాలు కమర్షియల్ గా పెద్ద సక్సస్ అవ్వనప్పటికీ దర్శకుడుగా క్రిష్ కు మంచిపేరు వచ్చింది. ఆతరువాత క్రిష్ బాలకృష్ణ తో ఎన్టీఆర్ బయోపిక్ తీసే అవకాశం వచ్చినప్పటికీ ఆసినిమా సక్సస్ కాకపోవడంతో క్రిష్ కు పెద్దగా అవకాశాలు రావడంలేదు.
ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ క్రియేటివ్ దర్శకుడుకి పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’ తీసే అవకాశం వచ్చినప్పటికీ క్రిష్ కు ఆ అవకాశం కూడ ఎటువంటి అదృష్టాన్ని ఇవ్వలేకపోయింది. క్రిష్ కెరియర్ లోనే బ్లాక్ బష్టర్ మూవీ అవుతుందని ఈ మూవీ గురించి చెప్పుకునే వారు. అయితే ఈ మూవీలో నటించడానికి పవన్ ఓకె చేసినప్పటి నుండి ఈమూవీ రకరకల కారణాలతో నిర్మాణం వాయిదా పడుతూ రావడంతో క్రిష్ కు ఏమాత్రం అదృష్టం లేదా అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం క్రిష్ ఈమూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో జ్యోతికృష్ణ ఈమూవీ దర్శకుడుగా రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో అనుష్క ‘ఘాటీ’ మూవీలో నటిస్తోంది. ఈమూవీ టీజర్ కు మంచి స్పందన రావడంతో తిరిగి క్రిష్ ట్రాక్ లోకి వస్తాడని అంతా భావించారు. వాస్తవానికి ఈమూవీ ఏప్రియల్ 18న విడుదల కావలసి ఉంది. అయితే ఈమూవీ మార్కెటింగ్ ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో ఈమూవీని జూన్ లో విడుదల చేస్తారు అని అంటున్నారు. అయితే ఈవిషయంలో కూడ క్లారిటీ లేకపోవడంతో ఈమూవీ ఇప్పట్లో విడుదల అవుతుందా అన్న సందేహాలు చాలామందికి వస్తున్నాయి..