
అయితే చాలామంది సందీప్ రెడ్డి వంగ మేకింగ్ ని విమర్శించారు. మరి కొంత మంది మాత్రం మెచ్చుకున్నారు. ప్రస్తుత జనరేషన్ కి తగ్గట్టుగా సినిమాలు తీస్తున్నారనే విధంగా మాట్లాడారు. యానిమల్ సినిమా విడుదలైనప్పటికి ఏడాది అవుతూ ఉన్న ఎక్కడో ఒకచోట ఇంకా ఈ సినిమా వివాదం కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా యానిమల్ సినిమాలోని బోల్డ్ సన్నివేశాలను చాలామంది విమర్శించారు. ఇప్పుడు తాజాగా జాతీయ అవార్డు గ్రహీత స్వానంద్ కిర్కిరే ఈ విషయం పైన మాట్లాడారు.
ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ చిత్రాలు ప్రస్తుత పరిస్థితుల పైన స్పందించారు.. తనకు యానిమల్ సినిమా పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అలాంటి సినిమా ఎలా హిట్ అయ్యిందో తనకి ఇప్పటికీ అర్థం కాలేదని తెలియజేశారు.స్వానంద్ మాట్లాడితే సినిమా గురించి తాను ఎక్కువగా మాట్లాడాలనుకోవడం లేదంటూ కానీ ఇలాంటి చిత్రాలు జనాలు ఎలా ఆదరించారు? ఏ కారణం చేత ఆదరించారు ?అనేదే తనకి ఇప్పటికీ అర్థం చేసుకోలేని ప్రశ్నగా మిగిలిందని తనకు తెలిసిన ఒక అమ్మాయి యానిమల్ చిత్రాన్ని రెండు మూడు సార్లు చూశానని చెప్పింది.. ఆ సినిమా చూడడానికి గల కారణం ఏంటా అని ప్రశ్నించగా.. ఆ చిత్రంలో ఆమె బాబీ డియోల్ మ్యాన్లీనేస్ కోసమే చూశానని చెప్పడంతో తనకు ఆశ్చర్యం కలిగిందంటూ తెలిపారు.. అయితే ఈ సినిమాలు చూపించిన మేకోర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నప్పటికీ ఇలాంటి సినిమాలు హిట్టు చేయడం అనేది సమాజానికి అంత మంచిది కాదు అన్నట్లుగా తెలిపారు స్వానంద్.