ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ లను ఎంత ఎక్కువగా అందుకుంటున్నారో అందరికీ తెలిసిందే . సినిమా కోసం పెట్టే బడ్జెట్ ఎంత హైగా ఉంటుందో.. సినిమాలో నటించే హీరోల రెమ్యూనరేషన్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది . అయితే ఒక సినిమాలో లీడ్ పాత్రలో నటించే స్టార్ హీరో అంత రెమ్యూనరేషన్ తీసుకుంటే పర్వాలేదు . కానీ గెస్ట్ పాత్రగా అదే విధంగా హీరోకి ఎలివేషన్స్ ఇస్తూ మరొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించిన హీరో కూడా ఎక్కువగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ  ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.


మరి ముఖ్యంగా సీనియర్ హీరో అక్కినేని నాగార్జున "కుబేర" సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ న్యూస్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నాగార్జున మరొక ఇంపార్టెంట్ పాత్రలో నటిస్తున్న సినిమా కుబేర . ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు.  అయితే ఈ సినిమా జూన్ 20వ తేదీ రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు శేఖర్ కమ్ముల అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది .



అయితే ఈ సినిమాలో నాగార్జున నటించినందుకుగాను 15 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారట . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది . నాగార్జునకి అంత రెమ్యూనరేషన్ ఇచ్చారా..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో ధనుష్ క్యారెక్టర్ తో సరి సమానంగా నాగార్జున క్యారెక్టర్ ఉంటుంది అని .. ఆ కారణంగానే మేకర్స్ అంత హై రెమ్యూనరేషన్ ఇచ్చారు అని మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా హాట్ టాపిక్ ట్రెండ్ అవుతూ నాగర్జున పేరు మారుమ్రోగిపోయేలా చేస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: