
కానీ ఈ సినిమా కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నట్లు బయటికి వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ కూడా డిఫరెంట్ గా ఉండబోతున్నాయి అని ..ఓ న్యూస్ సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ గా మారింది. కాగా ఇప్పుడు ఫౌజి సినిమా నుంచి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది . ఫౌజి సినిమాలో ప్రభాస్ కి తల్లిగా ఓ స్టార్ హీరోయిన్ ని చూస్ చేసుకున్నారట హనురాఘవపూడి . ఆమె కూడా ఈ పాత్ర చేయడానికి ఓకే చేసిందట.
ఆమె మరి ఎవరో కాదు బాలయ్య ఫేవరెట్ హీరోయిన్ సిమ్రాన్ . బాలయ్య - సిమ్రాన్ కాంబోలో ఎన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయో అందరికీ తెలిసిందే. ఒకానొక ఇంటర్వ్యూలో బాలయ్య - సిమ్రాన్ ఓ రేంజ్ లో పొగిడేసారు . స్క్రీన్ పై సిమ్రాన్ - బాలయ్య అంటే ఓ రేంజ్ కిక్ ఎక్కిస్తుంది అన్నట్లు మాట్లాడారు . కాగా ప్రభాస్ కి తల్లిగా ఫౌజి సినిమాలో సిమ్రాన్ ను చూస్ చేసుకున్నారట డైరెక్టర్ హను రాఘవపూడి. ఈ సినిమాలో హీరోకి ఎంత హై ఎలివేషన్స్ ఉంటాయో.. ప్రభాస్ తల్లి పాత్ర నటించే ఆవిడకి కూడా చాలా స్పెషల్ పవర్ ఉంటుందట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ చక్కరలు కొడుతుంది . చూడాలి మరి ప్రభాస్ కి తల్లి పాత్రలో సిమ్రాన్ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో..?