సినిమా ఇండస్ట్రీలో బోలెడుమంది హీరోలు ఉన్నారు . అయితే అందరికీ ది మోస్ట్ ఫేవరెట్ గా నిలిచేది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ . ఆఫ్ కోర్స్ కొంతమందికి ఆయన అంటే పడదు.  అది పూర్తిగా ఆయనను పొలిటికల్ పరంగా టార్గెట్ చేసి ట్రోల్ చేసే వాళ్ళు మాత్రమే . వ్యక్తిగతంగా సినిమాలు పరంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే అందరికీ అభిమానం ఇష్టం . కాగా జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ ని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు జనాలు . ఒక పొలిటీషియన్ తన ప్రసంగంతో ఎలా జనాలను ఆకట్టుకుంటాడో అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ తన మాటలతో అట్రాక్ట్ చేస్తారు అని ..ఆ విషయంలో అచ్చం తాత లానే ఈ మనవడు దిగిపోయాడు అని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు .


కాగా మరికొద్ది రోజుల్లోనే వార్ 2 సినిమాతో జనాలను పలకరించడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్ . దేవర2 ను అదే విధంగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కే సినిమా లపై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు.  కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఏంటో ఈ సినిమాల ద్వారా జనాలకి తెలుస్తుంది అంటూ కూడా నందమూరి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఇదే మూమెంట్లో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ గా మారింది . జూనియర్ ఎన్టీఆర్ ఎంతోమంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు .



కొంతమంది ఆయన సెలక్షన్ ని బాగా మెచ్చేసుకుంటూ ఉంటారు . యమదొంగ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా చూస్ చేసుకునింది జూనియర్ ఎన్టీఆర్ నే అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . అంతేకాదు బృందావనం సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను చూస్ చేసుకుంది కూడా జూనియర్ ఎన్టీఆర్ నే అంటూ అప్పట్లో బాగా ఓ న్యూస్ వైరల్ అయింది . కాగా ఎంతోమంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే మాత్రం నిత్యమీనన్ అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చారు . ఆమె నాచురల్ యాక్టింగ్ ఆయనకు చాలా చాలా ఇష్టమని ..ఓపెన్ గానే చెప్పుకు వచ్చాడు . జనతా గ్యారేజ్ సినిమాలో వీళ్లు స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  స్క్రీన్ పై కనిపించినది తక్కువ టైం అయినా నిత్యమీనన్ నటన మాత్రం ఈ సినిమాకి కెవ్వు కేక అనే చెప్పాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: