టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న విషయం తెలిసిందే. అందులో నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తుంది. తన కెరీర్ లో ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. కాగా, సమంత తన సినిమాలగాను ఎన్నో అవార్డులను సైతం అందుకుంది. సమంత సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ప్రముఖ నటుడు హీరో నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరి వివాహం చాలా తక్కువ సమయంలోనే ముగింపు పలికింది. 

కేవలం నాలుగేళ్ల ప్రాయంలోని మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. విడాకులు అనంతరం సమంత ఎప్పటిలానే సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇక నాగచైతన్య మాత్రం రెండవ వివాహం చేసుకొని చాలా సంతోషంగా తన లైఫ్ కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన కొన్ని వార్తలు చాలా రోజుల నుంచి సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. సమంత కూడా రెండవ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుందని....అంతేకాకుండా రాజ్ నిడుమోరుతో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.... త్వరలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ సమంత ఇప్పటివరకు ఆ వార్తలపై స్పందించలేదు. ఇక మరో రెండు నెలల్లో వీరి ఎంగేజ్మెంట్ కి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే సమంత ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ ఈ వార్తలకు ముగింపు ఉండదు. ఈ విషయం తెలిసే సమంత అభిమానులు చాలా సంతోషపడుతున్నారు. సమంత మళ్ళీ వివాహం చేసుకొని తన లైఫ్ ను చాలా సంతోషంగా కొనసాగించాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: