పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కృష్ణం రాజు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతో సక్సెస్ అయిన ఈ హీరోసినిమా అనంతరం వరుసగా సినిమా చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరోగా తన కెరీర్ కొనసాగించాడు. ప్రభాస్ ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించారు. అందులో బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. ఈ సినిమా అనంతరం ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం. 

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు నాలుగు సినిమా ప్రాజెక్ట్ లకు పైనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్, ది రాజా, సలార్-2 సినిమాలలో నటిస్తున్నారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం నటించబోయే స్పిరిట్ సినిమాలో స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటించే అవకాశాలు ఉన్నట్లుగా సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఉన్ని ముకుందన్ ను సినిమాలో విలన్ పాత్ర కోసం డైరెక్టర్ అతడిని సంప్రదించినట్టుగా సమాచారం అందుతుంది. దీనికి ఉన్ని ముకుందన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ విషయం పైన స్పిరిట్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

 ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నెలలో ప్రారంభం కానున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. మలయాళ నటుడైన ముకుందన్ రీసెంట్ గా మార్కో సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. కాగా, స్పిరిట్ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా రష్మిక మందనను అనుకుంటున్నారట. ప్రస్తుతం రష్మిక మందన టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీగా తన కెరీర్ కొనసాగిస్తోంది. ఈ సినిమాలో ఈ బ్యూటీని హీరోయిన్ గా పెట్టినట్లయితే సినిమా సక్సెస్ అవుతుందని దర్శకుడు భావిస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: