తమిళ నటుడు అజిత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈయన గత కొంతకాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటూ డీలా పడిపోయాడు. దానితో ఈయన అభిమానులు కూడా కాస్త డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. ఇకపోతే తాజాగా అజిత్ , అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో హీరోగా నటించాడు. మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఈ సినిమాను ఏప్రిల్ 10 వ తేదీన భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేశారు. ఈ మూవీ కి మంచి టాక్ వచ్చింది. ఈ సినిమాకు ప్రస్తుతం సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. దానితో అజిత్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన రోజుల బాక్స్ ఆఫీసర్లను కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు వచ్చాయి. 12 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. ఇంకా ఈ మూవీ ఎన్ని కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

13 రోజుల్లో ఈ సినిమాకు తమిళనాడు ఏరియాలో 137.60 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6 కోట్లు , కర్ణాటక ఏరియాలో 13.75 కోట్లు , కేరళలో 3.35 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.30 కోట్లు , ఓవర్సీస్ లో 59.65 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 108.75 కోట్ల షేర్ ... 222.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 116 కోట్ల భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 7.25 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ak