తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది ఎలాంటి సపోర్ట్ లేకుండా హీరోలుగా పరిచయమైతే మరి కొంతమంది సినీ బ్యాగ్రౌండ్ నుంచి సినిమాల్లోకి హీరోలుగా ఎంట్రీ ఇస్తారు. అలాంటి వారిలో నటుడు ప్రభాస్ ఒకరు. కృష్ణంరాజు వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన ప్రభాస్ తనదైన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. ఈ హీరో అతి చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికీ కూడా వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరోగా తన కెరీర్ కొనసాగిస్తున్నాడు. ప్రభాస్ తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి తన నటనకు ఎన్నో అవార్డులను సైతం అందుకున్నాడు. 

ప్రభాస్ ఇప్పటివరకు నటించిన సినిమాలలో డార్లింగ్ సినిమా మాత్రం చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఈ సినిమాతో ప్రభాస్ ను ప్రతి ఒక్కరు డార్లింగ్ డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా, క్యూట్ గా కనిపించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. తన ఆటిట్యూడ్, డ్రెస్సింగ్ స్టైల్ తో అమ్మాయిల మనసులను కొల్లగొట్టాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది. వీరిద్దరి జంట చాలా బాగుంటుంది. చాలా క్యూట్ గా, అందంగా కనిపిస్తారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్, కాజల్ కు చాలా మంచి స్నేహం ఏర్పడిందట. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారినట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపించింది.

చాలా సీక్రెట్ గా కాజల్, ప్రభాస్ వారి రిలేషన్ కొనసాగించారట. ఆ తర్వాత ఏమైందో తెలియదు వివాహం చేసుకోవాలని అనుకున్నప్పటికీ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారట. ఆ తర్వాత కాజల్ ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. చాలా సంవత్సరాల పాటు గౌతమ్, కాజల్ ప్రేమించుకుని కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు. ప్రస్తుతం వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. ఇక ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు వివాహం చేసుకోకుండా చాలా హ్యాపీగా తన లైఫ్ ను కొనసాగిస్తున్నాడు. ప్రభాస్ వివాహం చేసుకుంటే చూడాలని తన అభిమానులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఎంతగానో కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: