టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన పటాస్ మూవీతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 , సరిలేరు నీకెవ్వరు , ఎఫ్ 3 , భగవంత్ కేసరి తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో వరుస విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ దర్శకుడిగా ఒక ప్రత్యేక ఈమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇకపోతే అనిల్ రావిపూడి తన తదుపరి మూవీ ని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు కూడా ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. తాజాగా అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయన ఓ కమీడియన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన కమీడియన్లలో ఒకరు అయినటువంటి సప్తగిరి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అయిన కూడా నేను దర్శకత్వం వహించిన ఏ సినిమాలో కూడా ఆయన నటించలేదు. అందుకు ప్రధాన కారణం ఆయనే. ఒకానొక సమయంలో నేను ఓ సినిమాకు సంబంధించిన కథ రాస్తున్న సమయంలో సప్తగిరి నాకు ఫోన్ చేశాడు.

నువ్వు కథ రాస్తున్న సినిమాలో నాకు ఏదైనా పాత్ర ఉందా అని అడిగాడు. అలాగే ఆయన సినిమాలో చిన్న పాత్ర అయితే నేను చేయను. సినిమా మొత్తం నేను కనిపించే పాత్ర అయి ఉండాలి. దానికి మంచి ప్రాధాన్యత ఉండాలి అన్నాడు. సప్తగిరికి అలాంటి పాత్ర నేను రాసుకున్న కథల్లో ఇప్పటికీ రాలేదు. అందుకే నేను దర్శకత్వం వహించిన సినిమాల్లో సప్తగిరి లేడు అని అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: