సినిమా ఇండస్ట్రీ లో ఒకరు రిజెక్ట్ చేసిన స్టోరీలో మరొకరు హీరోగా నటించడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా ఓ హీరో రిజెక్ట్ చేసిన మూవీలో మరో హీరో నటించి ఆ మూవీతో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన తన కెరియర్లో చాలా సినిమాలను వదులుకున్నాడు. అలా పవన్ కళ్యాణ్ వదిలేసిన ఓ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించగా ... ఆ సినిమా ఏకంగా ఇండస్ట్రీ హీట్ అయ్యింది. మరి పవన్ కళ్యాణ్ వదిలేసిన ఆ సినిమా ఏది ..? మహేష్ ఏ మూవీతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు "పోకిరి" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్గా నటించగా ... డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. మణిశర్మమూవీ కి సంగీతం అందించాడు. భారీ అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ మూవీ కథను మొదట పూరి జగన్నాథ్ , మహేష్ బాబు తో కాకుండా పవన్ కళ్యాణ్ తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా పవన్ ను కలిసి కథ మొత్తాన్ని కూడా వివరించాడట. కథ మొత్తం విన్న పవన్ ఆ కథతో సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట. దానితో పూరి జగన్నాథ్ అదే కథను మహేష్ బాబుకు వినిపించగా , ఆయనకు ఆ కథ నచ్చడంతో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక పోకిరి అనే టైటిల్ తో మహేష్ హీరో గా పూరి జగన్నాథ్ మూవీ ని రూపొందించగా ఈ సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హెడ్ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: