గతంలో నటించిన చాలామంది నటీనటులు ఈ మధ్యకాలంలో చాలామంది కనుమరుగయ్యారు. ఒకప్పుడు తమ నటనతో సినిమాలకు ప్లస్ గా మారిన వారు కూడా ఉన్నారు.. చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న వారు సినిమాలలో కూడా ర్యాంప్ పాత్రలలో నటించారు. ముఖ్యంగా బోల్డ్ పాత్రలతో పాపులారిటీ సంపాదించుకున్న వారిగా రమ్యశ్రీ కూడా ఒకరు.. ఇమే తెలుగు ,తమిళ్, మలయాళం, కన్నడ, భోజపురి ఇతరత్రా భాషలలో కూడా నటించి బాగా ఆకట్టుకుంది.


ముఖ్యంగా బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రమ్యశ్రీ 250కుపైగా చిత్రాలలో కూడా నటించింది. ఈమె అప్పట్లో స్టార్ యాక్టర్ గా పేరు సంపాదించింది. ప్రస్తుతం రమ్యశ్రీ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ నటిగా తన కెరీర్ని ప్రారంభించిన తర్వాతే మళ్ళీ తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పలు చిత్రాలలో నటించింది. ఇమే ఎక్కువగా శృంగార పాత్రలలోనే నటించడంతో ఈమెకు అన్నీ కూడా అలాంటి అవకాశాలే వచ్చాయి. ముఖ్యంగా ఈమె నటించిన పాత్రలు చాలామంది కూడా విమర్శించారని అయినా కూడా తాను వాటన్నిటిని పట్టించుకోకుండా తనకు వచ్చిన పాత్రలలో నటించానని తెలిపింది.


చాలామంది తనని బట్టలు సరిగ్గా వేసుకోనని కామెంట్స్ చేస్తూ ఉంటారు.ఇలాగే ఒక ఈవెంట్ అమెరికాలో జరుగుతోందని పిలిచారు.. ఆ తర్వాత ఆమె అసభ్యకరంగా బట్టలు వేసుకుందని వద్దని చెప్పి తిరిగి పంపించాలని చూశారు..ఆ తర్వాత కొంతమంది తనకు సపోర్ట్ చేసి  తనని రమ్మన్నారు.. అక్కడ తనని చూసి  ఆశ్చర్యపోయారని సినిమాలలో బోల్డ్ గా కనిపించేతాను చీరకట్టులో చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఒక పెద్దాయన మాత్రం తనను ఉద్దేశించి చీర కట్టిన ప్రతి ఒక్కరు కూడా పతివ్రత కాదు అని డ్రెస్సులో చూసి ఎవరిని అంచనా వేయకూడదు అంటూ తెలిపారని తెలిపింది. అలాగే బి గ్రేడ్ చిత్రాలలో కూడా నటించాలని ఆఫర్లు వచ్చిన అలాగే నీలి చిత్రాలలో నటించాలని తనమీద చాలామంది ఒత్తిడి తెచ్చారు.. కానీ తాను అలాంటివి చేయనని చెప్పానని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: