రామ్ చరణ్ ఈ హీరో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన రామ్ చరణ్ తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. రామ్ చరణ్ ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. ఈ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది. 

కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా స్టోరీ చాలా బాగున్నప్పటికీ ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. ఈ సినిమా ఫలితాన్ని పక్కనపెట్టి రామ్ చరణ్ తన తదుపరి సినిమా షూటింగ్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. రామ్ చరణ్ - బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి బుచ్చి బాబు కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు.

సినిమా కథను లాక్ డౌన్ సమయంలో రాసినట్లుగా వెల్లడించారు. పెద్ది సినిమా కథలో కొంత ఊహాజణితం ఉంది. కొంత మాత్రం నిజ జీవిత గాథల నుంచి తీసుకున్నానని బుచ్చిబాబు వెల్లడించారు. నిజ జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి కథలకు ప్రజలు బాగా కనెక్ట్ అవుతారు అనేది నా అభిప్రాయం అని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో ఈ సినిమా కథ రాశానని చెప్పాడు.


పెద్ది సినిమా కథను సుకుమార్ కు వినిపిస్తే చాలా బాగుందని వెంటనే రామ్ చరణ్ కు చెప్పమని చెప్పాడు. ఫస్ట్ టైమ్ లోనే రామ్ చరణ్ కు ఈ సినిమా కథ చెబితే వెంటనే ఓకే చెప్పారని బుచ్చిబాబు అన్నారు.  కానీ సినిమా కథలో కొన్ని మార్పులు మాత్రం చేయమని సూచించినట్టుగా బుచ్చిబాబు వెల్లడించారు. ప్రస్తుతం బుచ్చిబాబు షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: