టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒకానొక సమయంలో హీరోయిన్లు చాలా తక్కువగా ఉండేవారు. ఇక నేటి కాలంలో హీరోయిన్లు అనేక సంఖ్యలో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. రోజుకో హీరోయిన్ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతూనే ఉన్నారు. అయినప్పటికీ అలనాటి హీరోయిన్లకు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అలాంటి హీరోయిన్లలో నటి త్రిష ఒకరు. ఈ చిన్నది వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో తన కెరీర్ అనేక మలుపులు తిరిగింది. వర్షం సినిమాలో ప్రభాస్ సరసన నటించిన ఈ చిన్నది ఆ సినిమాతో మంచి సక్సెస్ సాధించింది.


సినిమా అనంతరం తెలుగులో అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది. తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక త్రిష ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించారు. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాష చిత్రాలలో అద్భుతంగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక త్రిష వయసు పెరిగినప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంది.

కానీ సినిమాలలో నటిస్తున్న సమయంలో అనేకమంది హీరోలతో ఎఫైర్లు కొనసాగించినట్లు అనేక రకాల వార్తలు వైరల్ అయినప్పటికీ త్రిష ఎవరిని కూడా వివాహం చేసుకోకపోవడం విశేషం. ఇక త్రిష వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం తరగని అందం, ఫిట్నెస్ కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా.... త్రిషకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ చిన్నది హీరో విజయ్ తో కలిసి అనేక సినిమాలలో నటించింది. అయితే విజయ్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో హీరో హీరోయిన్ కి మధ్య కిస్ సీన్ ఉందట.


అయితే ఆ సమయంలో త్రిష హీరో విజయ్ కి కిస్ ఇవ్వడానికి త్రిష నో చెప్పిందట. ఆ ఆఫర్ ను సున్నితంగా రిజెక్ట్ చేసిందట. దానికి దర్శకుడు కూడా ఒప్పుకొని ఆ సీన్ ను సినిమా నుంచి తొలగించారట. ఆ తర్వాత సినిమాని రిలీజ్ చేయగా మంచి విజయాన్ని అందుకుంది. త్రిషకి సంబంధించిన ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: