జమ్ము కాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో మొత్తం 26 మంది టూరిస్టులు మరణించారు. ఇదే తరుణంలో దేశవ్యాప్తంగా మరణించిన వారి  ఆత్మ శాంతించాలని కోరుతూ ర్యాలీలు చేస్తున్నారు. అంతేకాదు ఆ ఉగ్రముకలను పట్టుకొని దెబ్బకు దెబ్బ తీయాలని నినాదాలు చేస్తున్నారు. ఇలా ఈ ఉగ్రదాడిపై రాజకీయ, వ్యాపార ప్రముఖులతో పాటు సినీ ఇండస్ట్రీలోని వారు కూడా స్పందిస్తున్నారు. అంతా ఇలా కొనసాగుతున్న తరుణంలో సాయిపల్లవి మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో చూసి సాయి పల్లవిపై విరుచుకు పడుతున్నారు. అదేంటో చూద్దాం.. అయితే ఈ ఘటన జరిగినప్పటి నుంచి దేశవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు ఒక్కొక్కరు .ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. 

ముఖ్యంగా దేశంలో హిందూ ముస్లింలు ఐక్యంగా ఉంటే ఇలాంటి ఘటనలు రావని అంటున్నారు. మనలో మనం కొట్టుకొని చావకూడదని కొందరు కేంద్రాన్ని తప్పుపడుతున్నారు. ఇదే క్రమంలో హీరోయిన్ సాయిపల్లవి పాత ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతుంది. మన ఆర్మీ పాకిస్తాన్ జనాలను  ఉగ్రవాదులు అనుకుంటోంది. వారు కూడా ఇండియా ప్రజలను ఉగ్రవాదులు అనుకుంటున్నారు. ఇదే హింసకు దారితీస్తోంది. మనం ఆలోచించే విధానం మారితే అంతా బాగానే ఉంటుంది అన్నట్టు మాట్లాడింది. అయితే పెహల్గామ్ దాడి  నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. దీంతో సాయిపల్లవి మన ఇండియాలో పుట్టిందా లేదంటే పాకిస్థాన్ లో పుట్టిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇదే తరుణంలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను పట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఎలాగైనా ప్రతీకార చర్య తీర్చుకుంటామని తెలియజేస్తోంది. అంతేకాకుండా ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్  టూరిస్టులు ఇతర వ్యక్తులు ఎవరైనా సరే రెండు రోజుల్లో ఖాళీ చేసి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా పాకిస్తాన్ కు ఇప్పటినుంచి ఇలాంటి విషయాల్లో కూడా సహకారం అందించకూడదని కేంద్రం నిర్ణయం తీసుకుంది.. ఇలా ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి కసరత్తులు చేస్తున్న తరుణంలో  సాయి పల్లవి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: