ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో తన అందం, అభినయంతో కట్టుబొట్టుతో కుర్రకారులను బాగా ఆకట్టుకున్న హీరోయిన్ శ్రియ శరణ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఈమె తెలుగుతోపాటు కన్నడ,మలయాళం, తమిళ్ వంటి భాషలలో కూడా హీరోయిన్గా నటించింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో నటిస్తూ ఉన్నది. అప్పట్లో శ్రీయ డేట్స్ కోసం ఎంతో మంది దర్శక నిర్మాతలు సైతం ఎదురుచూసేవారు. ఇప్పటికి నాలుగు పదుల వయసు దాటినా కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నది శ్రీయ. అయితే ప్రస్తుతం హీరోయిన్గా కాకుండా సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ఉన్నది.

ఈ మధ్యకాలంలో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో కొంతమేరకు సైలెంట్ గా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం నిరంతరం యాక్టివ్ గా ఉంటూ బ్లాస్ట్ అయ్యే  ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు తాజాగా శ్రీయ ఒక స్పెషల్ సాంగ్ కూడా చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. హీరో సూర్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న రెట్రో చిత్రంలో సూర్యకి జోడిగా పూజా హెగ్డే నటించింది. ఇటీవలే ట్రైలర్ కూడా విడుదల కాగా బాగానే ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది.


మరో 10 రోజులలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న తరుణంలో ఈ సినిమా ప్రమోషన్స్లో చిత్ర బృందం కూడా బిజీ గా వున్నది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం. ఇందులో హీరోయిన్స్ రియల్ స్పెషల్ సాంగ్ చేయనుందని ఈ సాంగ్ ఒక రేంజిలో చిత్ర బృందం చిత్రీకరించినట్లుగా టాక్ వినిపిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ శ్రీయ ఇలా స్పెషల్ సాంగ్లో కనిపించబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా తర్వాత ఈమెకు అవకాశాలు క్యూ కడతాయని అభిమానులు భావిస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ అందరి అంచనాలను మించేలా ఉంటుందనే విధంగా టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: