పెళ్లి చేసుకొని అన్ని సంవత్సరాలు కాపురం చేసిన పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదని రేణు దేశాయ్ నిజంగానే చెప్పిందా.. ఇంతకీ రేణు దేశాయ్ అలా మాజీ భర్తను అవమానించేలా ఎందుకు మాట్లాడింది.పవన్ కళ్యాణ్ తెలియదంటూ రేణు దేశాయ్ మాట్లాడటం వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. దేశవ్యాప్తంగా ఆయనకు ఎంత పెద్ద ఫాలోయింగ్ ఉందో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా జనసేన పార్టీ పెట్టి ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన రేంజ్ మరింతగా పెరిగిపోయింది.కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి సైతం ఈయన్నీ మెచ్చుకుంటున్నారు. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మాజీ భార్య రేణు దేశాయ్.. ప్రతి ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నలు ఎదురైతే ఆయన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టే రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదని ఎందుకు అంటుంది అని చాలామందిలో ఒక అనుమానం ఉంటుంది. 

అయితే పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని చెప్పింది పవన్ పరిచయం అయ్యాక కాదు బద్రి సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందట. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ బద్రి సినిమాలో హీరోయిన్స్ గా ఎవరిని తీసుకోవాలి అని పూరి జగన్నాథ్ సెర్చ్ చేస్తున్న సమయంలో ముంబైలోని కొంతమంది మేనేజర్స్ ద్వారా పూరి జగన్నాథ్ దగ్గరికి రేణుదేశాయ్ ఫోటోలు వచ్చాయట.అయితే అప్పటికే రేణుదేశాయ్ మోడలింగ్ చేస్తుంది. ఇక తన సినిమాలో రేణుదేశాయ్ సెట్ అవుతుంది అని పూరి అనుకొని వెంటనే నెంబర్ తీసుకొని కాల్ చేశారట. కానీ నాకు సినిమాల్లో ఇంట్రెస్ట్ లేదు.నేను ఆ సినిమా చేయను అని మొహం మీదే చెప్పేసిందట రేణు దేశాయ్. అయినా కూడా వదలకుండా పూరి జగన్నాథ్ పట్టుబట్టి మంచి స్టోరీ పెద్ద హీరో సినిమాలో మీరు హీరోయిన్ అని చెప్పడంతో ఇంతకీ ఆ హీరో ఎవరు అని అడిగిందట.పవన్ కళ్యాణ్ అని చెప్పడంతో ఈ పవన్ కళ్యాణ్ ఎవరు..ఆయన ఎవరో నాకు తెలియదు.నాకు తెలుగులో వెంకటేష్, చిరంజీవి,నాగార్జునలే తెలుసు. పెద్ద హీరో అంటున్నారు కానీ ఆయన ఎవరో నాకు తెలియదు అని సమాధానం ఇచ్చిందట.

దాంతో పూరి జగన్నాథ్ మీకు తెలిసిన చిరంజీవి తమ్ముడే ఈ పవన్ కళ్యాణ్.. తొలిప్రేమ సినిమా చూడలేదా.. ఆయన ఇప్పుడు పెద్ద స్టార్ అని చెప్పారట. అయినా కానీ వినకుండా రేణుదేశాయ్ నేను ఒకసారి ఆయన్ని చూడాలి చూశాకే ఒకే చేస్తాను అని చెప్పిందట. దాంతో హైదరాబాద్ కి రమ్మని రామానాయుడు స్టూడియోలో పవన్ కళ్యాణ్ ని చూపించారట. అయితే ఆ టైంలో పవన్ కళ్యాణ్ ని చూసిన రేణు దేశాయ్ షాక్ అయిపోయిందట. ఎందుకంటే అంత పెద్ద హీరో అంటున్నారు కానీ ఆయనలో ఎలాంటి గర్వం కూడా కనిపించలేదట. ఎందుకంటే అందరికంటే ముందుగానే షూటింగ్ సెట్ కి వచ్చి చాలా సింపుల్ గా అందరితో కలిసిపోతూ సోఫాలో కూర్చొని ఉన్నారట. ఇక ఆయన సింప్లిసిటీ చూసి రేణు దేశాయ్ నమ్మకంతో బద్రి సినిమాకి ఒప్పుకుందట. అలా బద్రి సినిమాకి ముందు పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అని రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారి సహజీవనం చేసి కొడుకు పుట్టాక పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: