చురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3’ మే 1న విడుదల కాబోతోంది. అదేరోజు తమిళ టాప్ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ కూడ విడుదల అవుతున్న సందర్భంలో ఈ రెండు సినిమాలలో ఏసినిమా సూపర్ హిట్ అవుతుంది అన్న విషయమై చర్చలు ఊహాగానాలు జరుగుతున్నాయి. అయితే నాని తన మూవీ ప్రమోషన్ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు సూర్య తన మూవీ విషయంలో తీసుకోలేకపోతున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

ముఖ్యంగా నాని జాతీయ మీడియా ప్రతినిధులకు అదేవిధంగా లోకల్ మీడియా ప్రతినిధులకు వరసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ తన మూవీ పై అంచనాలను విపరీతంగా పెంచుతున్నాడు. ప్రస్తుతం నాని బాలీవుడ్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాకుండా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రధానగరాలలో తన మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో వరసపెట్టి పాల్గొంటూ ఈసినిమా కలక్షన్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తన ప్రయత్నాలను గట్టిగా ప్రాయయత్నిస్తున్నాడు. 

అయితే ఈవిషయంలో హీరో సూర్య తనయ మెట్రోకు సంబంధించి ఎలాంటి ఈవెంట్స్ చేయకుండా కాలయాపన చేస్తున్నాడు. వాస్తవానికి హీరో సూర్యకు ఒక హిట్ కావాలి ‘ఆకాశమే నీ హద్దురా’ మూవీ తరువాత సూర్య ఎన్నో సినిమాలాలో అతడు నటిస్తున్నప్పటికీ అతడికి హిట్ రావడంలేడు. ఆమధ్య విడుదలైన ‘కంగువ’ మూవీ కోసం సూర్య రెండు సంవత్సరాలు కష్టపడినప్పటికీ ఫలితం దక్కలేదు. దీనితో ‘రెట్రో’ విజయం సాధించడం సూర్య కెరియర్ కు ఎంతో అవసరం. 

ఈమూవీలో  హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే ఈమూవీ ప్రమోషన్ విషయంలో కష్టపడుతున్నప్పటికీ అదే స్థాయిలో సూర్య తన లేటెస్ట్ మూవీ విషయంలో ఎందుకు ఆసక్తి కనపరచడం లేదు అంటూ కొందరు షాక్ అవుతున్నారు. లోకేష్ కనకారాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ పై ఒక్క తమిళనాడు తప్ప మరెక్కడా క్రేజ్ లేకపోవడం సూర్య అభిమానులకు కూడ షాక్ ఇస్తోంది. దీనితో నాని నటించిన మూవీ సూర్య సినిమా కంటే ముందు అంజలో ఉంది అన్న ప్రచారాం జరుగుతోంది..





మరింత సమాచారం తెలుసుకోండి: