యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒక రు అయినటువంటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దా నితో ఎన్టీఆర్ - నీల్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ షూటింగ్ను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ కి డ్రాగన్ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోం ది. ఆల్మోస్ట్ ఇదే టైటిల్ను మేకర్స్ ఫైనల్ చేసి మరికొన్ని రోజుల్లోనే అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ నిర్మాణ విషయంలో మైత్రి సంస్థతో పాటు మరో బ్యానర్ వారు కూడా భాగస్వామ్యం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను మైత్రి సంస్థతో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆఖరుగా దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. దేవర పార్ట్ 1 ఈ సినిమాను నిర్మించిన బ్యానర్లలో కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ఉంది.

అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ కావడం , ఆ మూవీ కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 అనే హిందీ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: