టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపా దించుకున్న దర్శకులలో పరుశురామ్ ఒకరు. ఈయన దర్శకత్వం లో రూపొందిన సినిమాలలో కొన్ని సిని మాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి . ఈయనకు అద్భుతమైన గుర్తింపును తీసుకు వచ్చిన సినిమాల లో మొదటి స్థానంలో గీత గోవిందం సినిమా ఉంటుం ది . ఈ మూవీ విజయంతో ఒక్క సారిగా తెలుగు సినీ పరిశ్రమలో పరుశురామ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దానితో ఈ సినిమా తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఈ దర్శకుడికి వచ్చింది.

దానితో మహేష్ బాబు హీరోగా పరుశురామ్ "సర్కారు వారి పాట" అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. కొంత కాలం క్రితం ఈయన ది ఫ్యామిలీ స్టార్ అనే మూవీని రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ దర్శకుడి తదుపరి మూవీ కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇకపోతే ప్రస్తుతం పరుశురాం ఓ తమిళ హీరోతో సినిమాను చేసే ప్రయత్నాలను వేగ వంతం చేసినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి కార్తీతో పరుశురామ్ నెక్స్ట్ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్తీ కి పరశురామ్ ఓ కథను వినిపించగా ... ఆ కథ బాగా నచ్చడంతో కార్తీ , పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కి రాంచ్ రాజ్ అనే టైటిల్ని కూడా అనుకుంటున్నాట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: