టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన రవితేజ హీరోగా జ్యోతిక హీరోయిన్గా రూపొందిన షాక్ అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. కానీ ఈ మూవీ ద్వారా హరీష్ శంకర్ కి అపజయం దక్కింది. ఆ తర్వాత ఈయన మిరపకాయ్ అనే సినిమాకు దర్శకత్వం వహించి మొదటి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ కి దర్శకత్వం వహించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని దర్శకుడిగా తనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక ఈమేజ్ ను సొంతం చేసుకున్నాడు.

ఆఖరుగా హరీష్ శంకర్ , రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాను రూపొందించాడు . మంచి అంచనాల నడుమ వి డుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని   ఎదుర్కొంది . ప్రస్తుతం హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు . తాజాగా హరీష్ శంకర్ ఓ ఈవెంట్లో పాల్గొన్నాడు . ఆ ఈవెంట్లో భాగంగా హరీష్ శంకర్ కి మీరు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న హీరోలలో బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేసే అవకాశం వస్తే ఏ హీరోతో చేస్తారు అనే ప్రశ్న ఎదురైంది.

దీనికి హరీష్ శంకర్ సమాధానం ఇస్తూ ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న హీరోలలో నాకు ఏ హీరోతో అయినా బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేయాల్సిన అవసరం వస్తే నేను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తాను అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. తాజాగా హరీష్ శంకర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: