టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో అత్యంత వేగంగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే వారిలో నాని ఒకరు. నాని ఎప్పటికప్పుడు సినిమాలను ఓకే చేస్తూ వాటిని వేగవంతంగా పూర్తి చేస్తూ సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉంటే నాని తాజాగా హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని మే 1 వ తేదీన విడుదల చేయనున్నారు. నాని ఇప్పటికే ది ప్యారడైస్ గా అనే మూవీ ని కూడా ఓకే చేశాడు. శ్రీకాంత్ ఓదెలా ఈ మూవీ కి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది.

మూవీ షూటింగ్ను మే 2 వ తేదీ నుండి ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత నాని , సుజిత్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇలా నాని ఇప్పటికే ఓ సినిమాను పూర్తి చేసి దానిని విడుదలకు రెడీ చేస్తున్నాడు. అలాగే ఓ మూవీకి కమిట్ అయ్యి ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ను కూడా మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ తర్వాత మూవీ ని కూడా ఇప్పటికే సెట్ చేసి పెట్టుకున్నాడు. ఇలా అదిరిపోయే రేంజ్ లైనప్ ను సెట్ చేసుకున్న నాని మరో క్రేజీ దర్శకుడి సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళ సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నానిమూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సుజిత్ దర్శకత్వంలో సినిమా కంప్లీట్ అయిన తర్వాత నాని , కార్తీక్ సుబ్బరాజు కాంబో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కార్తీక్ సుబ్బరాజు తాజాగా సూర్య హీరోగా రెట్రో అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ని మే 1 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: