తెలుగులో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ ‘ అర్జున్ రెడ్డి ’ ప‌లు భాష‌ల్లో రీమేక్ అయ్యింది. ఈ సినిమా ను కోలీవుడ్ లో ఆదిత్య వ‌ర్మ‌ పేరుతో రీమేక్ చేశారు. ఆ సినిమాకు గిరీశ‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత తెలుగులో ‘ రంగ రంగ వైభ‌వంగా ’ సినిమాకు గిరీశ‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించ గా అది పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. మెగా ఫ్యామిలీ హీరో పంజా వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన ఈ సినిమా పెద్ద ప్లాప్‌. అయితే ఇప్పుడు ఇదే గిరీశ‌య్య క‌ళ్యాణ్ రామ్ కోసం ఓ క‌థ రెడీ చేసుకుని క‌ళ్యాణ్ రామ్ చుట్టూ తిరుగుతున్న‌ట్టు తెలుస్తోంది.


గిరీశ‌య్య క‌ళ్యాణ్ రామ్‌ను ఒప్పించేందుకు చాలా రోజులుగా ఆయ‌న వెంట ప‌డుతున్నాడ‌ట‌. క‌ళ్యాణ్ రామ్‌కు కూడా క‌థ న‌చ్చింద‌ని .. అయితే గిరీశ‌య్య‌ను వెయిటింగ్‌లో పెట్టాడ‌ని అంటున్నారు. ఇదో యాక్ష‌న్ డ్రామా అని ... రొటీన్ ఫార్ములాకు కాస్త భిన్నంగా సాగే క‌థ అని స‌మాచారం. రీసెంట్ గా క‌ళ్యాణ్ రామ్అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతీ ’ సినిమా తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ సినిమా అంచ‌నాలు అందుకోలేదు. విజ‌య‌శాంతి లాంటి సీనియ‌ర్ హీరోయిన్ ఉన్నా కూడా కాలం చెల్లిన క‌థ‌, క‌థ‌నాలు సినిమాకు మైన‌స్ అయ్యాయి.


ఈ వైజ‌యంతీ సినిమా త‌ర‌వాత క‌ల్యాణ్ రామ్ చేయ‌బోయే సినిమా గిరీశ‌య్య దే కావొచ్చు. ‘బింబిసార 2’ కూడా ప‌ట్టాలెక్కించే ఆలోచ‌న‌లో క‌ళ్యాణ్ ఉన్నా .. క‌థ పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. పైగా ‘బింబిసార 2’కు రూ.100 కోట్ల‌కు మించి బ‌డ్జెట్ అవ‌స‌రం .. మ‌రి క‌ళ్యాణ్ ఏం చేస్తాడో ?  చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌తో స‌మ‌స్య మీది.. ప‌రిష్కారం మాది..

అవినీతి అయినా.. లంచాలైనా.. రాజ‌కీయ నాయ‌కులు పెట్టే ఇబ్బందులు అయినా మీ స‌మ‌స్య‌ను మా స‌మ‌స్య‌గా భుజాన వేసుకుంటాం. నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అధికారులు దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చింతించాల్సిన అవ‌సర‌మే లేదు. రండి.. చేయి చేయి క‌లుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ స‌మ‌స్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.. ప‌రిష్కార మార్గాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: