
ఇదిలా ఉంటే జాన్వీ ఇప్పుడు కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందట. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ జాన్వీ కపూర్‌తో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు కోలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ సామాజిక అంశాలపై నడుస్తుందని కూడా సమాచారం. దీంతో ఈ వెబ్ సిరీస్‌లో జాన్వీ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. పా రంజిత్ సినిమా లలో చేసిన హీరోయిన్ల కు మంచి పేరు వస్తుంది. మరి ఇప్పుడు రంజిత్ చెప్పిన కథకు జాన్వీ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆమె ఈ వెబ్ సిరీస్‌కు ఓకే చెబితే ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందో ? కోలీవుడ్ ప్రేక్షకులను ఎలా మెస్మరైజ్ చేస్తుందో ? చూడాలి. అయితే జాన్వీ హీరోయిన్ గా క్రేజ్ ఉండగానే వెబ్ సీరిస్ ఎందుకు చేస్తుందా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి.