
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3 సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నారు. నాని సినిమా వస్తుందం టే చాలు అంచనాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో తెలిసిందే. నార్త్ లో ప్రమోషన్లు చేసేందుకే నాని ఏకంగా 10 రోజులకు పైగా సమయం కేటాయించారు. శైలేష్ కొలను యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ను తెరకెక్కించాడు. శైలేష్ గత సినిమా సైంధవ్ డిజాస్టర్ అయినా కూడా ఆ ప్రభావం హిట్ 3 సినిమా మీద ఏ మాత్రం లేకుండా నాని కావాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాడు. ఇక హిట్ 3 సినిమాలో అర్జున్ సర్కార్ పాత్రలో నాని విధ్వంసాన్ని సృష్టించబోతున్నాడని ఇప్పటికే సమాచారం బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో నాని కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నాని త్వరలో హీరోగా దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ విషయాన్ని గతంలోనే చెప్పాడు.
అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది ? ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది ? అనే విషయంపై నాని తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పెండింగ్లో ఉండడంతో సుజిత్ ఆ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు .. ఓజీ సినిమా పూర్తయ్యాక నాని సినిమాపై సుజిత్ వర్క్ స్టార్ట్ చేస్తాడట. ఈ విషయాన్ని నాని స్వయంగా తెలిపారు. ఓజీ సినిమా ముగిసిన వెంటనే నాని పని సుజిత్ స్టార్ట్ చేస్తాడు . ఇక హిట్-3 మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.