స్టార్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే చాలామంది ఈ సినిమాని నెగిటివ్ గానే ప్రచారం చేశారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా రిలీజ్ ముందే ప్లాప్ అని కూడా టాక్ రావడంతో ఈ సినిమా భారీ నష్టాన్ని మిగిలింది. ఈ సినిమా రిలీజ్ అయిన గంటకి ఒరిజినల్ ప్రింట్ కూడా ఆన్లైన్లోకి రావడంతో సైబర్ క్రైమ్ వరకు కూడా ఈ సినిమా పరిస్థితి వెళ్ళింది.


ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఏదో ఒక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పైన తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాకు కథ ఇచ్చింది తానే అని.. ఆ కథ వేరే అంటూ తెలిపారు. ప్రస్తుతం తాను హీరో సూర్యతో రెట్రో సినిమా చేయగా మే ఒకటో తేదీన రిలీజ్ అవుతూ ఉండగా ప్రమోషన్స్ లో పాల్గొన్న కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమా పైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.



కార్తీక్ సుబ్బరాజు ఇలా మాట్లాడుతూ.. నేను శంకర్ సార్ కి కేవలం ఒక లైన్ స్టోరీనే ఇచ్చానని అది కూడా ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ కథ అని.. అయితే ఆ తర్వాత ఒక డిఫరెంట్ ప్రపంచంలో మార్చేశారు చాలామంది రైటర్స్ వచ్చి కథని, స్క్రీన్ ప్లేను మార్చేయడం జరిగిందని తెలిపారు. దీంతో కార్తీక్ సుబ్బరాజు చేసిన ఈ వ్యాఖ్యలు మెగా అభిమానులను హర్ట్ అయ్యేలా చేస్తున్నాయి. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఇచ్చిన కథని చేసి ఉంటే సినిమాకి ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. అయితే గతంలో డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని తాను ఐదు గంటలకు పైగా తెరకెక్కించాలనుకున్నాను అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: