
తనను బాడీ షేమింగ్ కూడా చేశారని ప్రవస్తి ప్రస్తావించడం సంచలనం అయింది. అయితే ప్రవస్తి ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని సింగర్ సునీత ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. పలువురు టాప్ సింగర్లు సైతం జడ్జీలను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. సింగర్ సునీత ఒక్కడున్నాడు సినిమాలోని "అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు" సాంగ్ ను షేర్ చేశారు.
ప్రవస్తి గురించి పరోక్షంగా సునీత ఈ పోస్ట్ పెట్టారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సునీత ఈ వివాదాల నుంచి బయటపడి కెరీర్ పరంగా మరిన్ని విజయాలు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సునీత రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. సునీత భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియాల్సి ఉంది.
సునీత సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా కెరీర్ ను కొనసాగిస్తున్నారనే సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సునీత పెళ్లి తర్వాత మాత్రం పరిమితంగా ఆఫర్లకు ఓకే చెబుతుండటం గమనార్హం. సింగర్ సునీత భవిష్యత్తు ప్రణాళికలు ఉండనున్నాయో చూడాల్సి ఉంది. సునీతను అభిమానించే అభిమానుల సంఖ్య తక్కువేం కాదనే సంగతి తెలిసిందే. సింగర్ సునీత పెళ్లి తర్వాత జీవితంలో మరింత సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది.